షాకింగ్ న్యూస్.. సెకన్‌కు ఒకరికి సోకుతున్న వ్యాధి.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్

1599

దిశ, కొత్తగూడ: టీబీ అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, పోగుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టీబీ వ్యాధి, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా టీబీ అలర్ట్ ఇండియా కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ.. ప్రజ‌ల్లో క్షయ (టీబీ) వ్యాధిపై విస్తృతమైన అవ‌గాహాన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వ్యాధి సోకి మ‌ర‌ణిస్తున్నారని గుర్తు చేశారు. క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని.. వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ క్షయ వ్యాధిపై సక్రమంగా మందులు వాడితే తగ్గుతుందన్నారు. టీబీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈసం రాజమ్మ, గుమ్మడి లక్ష్మి నారాయణ, ఉపాధ్యాయులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..