లాక్‌డౌన్ తర్వాతే వెహికల్ ట్యాక్స్ చెల్లింపులు

by  |

దిశ, న్యూస్ బ్యూరో : మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపుదారులకు లాక్‌డౌన్ తర్వాత నెల రోజుల సమయాన్నిఇస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో ముగిస్తున్న త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ వెహికల్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. కాగా, లాక్‌డౌన్ కారణంగా వాహనదారులు ట్యాక్స్ చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో వాహనదారుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం వారికి ఊరట కల్పించింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తేదీ నుంచి నెల రోజుల అదనపు గడువు ఇస్తున్నట్టు ప్రభుత్వ కార్యదర్శి సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజుల్లో చెల్లింపులు జరిపేవారికి పెనాల్టీ విధింపు కూడా లేదని అందులో పేర్కొన్నారు.

Tags: Vehicles, Transport, Telangana, Tax

Next Story

Most Viewed