కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత! బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత! బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బతుకే ఇంత.. రోజుకో మాట, పూటకో అబద్ధం.. అంటూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తాం. అధికారంలోకి వచ్చాక.. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చినం, ఈ యాసంగిలో బోనస్ ఇవ్వలేం. పార్లమెంట్ ఎన్నికల ముందు.. వానకాలం నుంచి ధాన్యానికి బోనస్ ఇస్తాం. పార్లమెంట్ ఎన్నికల అయ్యాక.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ బోనస్ పై తీవ్ర విమర్శలు చేసింది.

రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ట్వీట్ చేసింది.

Next Story

Most Viewed