సర్కార్ కీలక నిర్ణయం.. ఆ శాఖ అధికారులపై సీఎంఓ ప్రత్యేక దృష్టి

by  |
సర్కార్ కీలక నిర్ణయం.. ఆ శాఖ అధికారులపై సీఎంఓ ప్రత్యేక దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలోని లాంగ్ స్టాండింగ్ అధికారులపై సర్కార్ దృష్టి సారించింది. హెల్త్ డిపార్ట్ మెంట్‌లోని వివిధ విభాగాల హెచ్‌ఓడీలు (హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్) ఏళ్ల తరబడి నుంచి ఒకే కూర్చులో తిష్ఠ వేశారనే వార్తలు రావడంతో, విమర్శల పాలు కాకుండా ప్రభుత్వం ఈ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నది. సంవత్సరాలుగా ఒకే సీట్‌లో పాతుకుపోయన వ్యక్తులను గుర్తించింది. వారి వివరాలను సంబంధిత ఉన్నతాధికారుల చేత సేకరిస్తున్నది. వారిని ఇంత కాలం నుంచి ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? వాటికి గల కారణాలు ఏమిటనీ అడిగి తెలుసుకుంటున్నది. వాళ్లను అక్కడ్నుంచి షిప్ట్ చేస్తే ఎక్కడకు పంపించాలి? పద్నోనుతుల అంశాలు ఎలా ఉన్నాయి.? ఒకవేళ ప్రస్తుతం ఉన్న హెచ్ ఓడీలను ఇతర స్థానాలకు పంపిస్తే, ఆ పోస్టుల్లో ఎవరిని నియమించవచ్చు? అనే అంశాలపై ప్రభుత్వం స్లాడీ చేస్తున్నది. అంతేగాక కరోనా విపత్కర పరిస్థితుల్లో వారి పాత్ర ఎలా ఉన్నది? సదరు ఆఫీసర్ల ఆధ్వర్యంలో క్రింది స్థాయి ఉద్యోగుల పనితీరు ఉలా ఉన్నది? ఫైళ్లన్నీ సక్రమంగా పూర్తవుతున్నాయా? హెచ్ ఓడీలంతా పనివేళల్లో సిబ్బందికి అందుబాటులో ఉంటున్నారా? వారికి ఉద్యోగుల మధ్య సమన్వయం ఎలా ఉన్నది? ఇటువంటి అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

బలోపేతం కొరకు మార్పులు..

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యశాఖలోని మౌలిక వసతులతో పాటు మ్యాన్ పవర్ పరిస్థితిపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. క్రమంగా మౌలిక సౌకర్యాలను పెంచడంతో పాటు పాటు దశల వారీగా సిబ్బంది నియామకాలను కూడా దశల వారీగా చేస్తున్నది. అంతేగాక ప్రస్తుతం వైద్యారోగ్యశాఖకు స్వయంగా సీఎం బాస్ కావడంతో అధికారుల మార్పు కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నది. హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రక్షాళనలో భాగంగా త్వరలో హెచ్ ఓడీలతో పాటు వివిధ కేటగిరీల ఉద్యోగుల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది మధ్య గుసగుసలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు త్వరలో వైద్యారోగ్యశాఖకు కొత్త బాసులు వాస్తున్నారంటూ సచివాలయ వర్గాలు కూడా లీక్‌లు ఇవ్వడం ఆ శాఖలో హట్ టాపిక్‌గా నడుస్తోన్నది.

డిప్యూటేషన్ అధికారులపై కూడా దృష్టి..

వైద్యారోగ్యశాఖలో వివిధ విభాగాలకు డిప్యూటేషన్ వచ్చిన అధికారులపై కూడా సర్కార్ దృష్టి సారించింది. డిప్యూటేషన్ గడువు ముగిసినా చాలా మంది ఆఫీసర్లు సొంత స్థానాలకు వెళ్లడం లేదు. దీంతో వారి వివరాలను కూడా సీఎంఓ కార్యాలయం సేకరిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని సెక్రటేరియట్‌లోని ఓ కీలక అధికారి దిశకు తెలిపారు.



Next Story

Most Viewed