ట్రంప్ సర్కారు దిగొచ్చి.. నిబంధనలు ఎత్తివేసింది!

by  |
ట్రంప్ సర్కారు దిగొచ్చి.. నిబంధనలు ఎత్తివేసింది!
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థి వీసాలపై నిబంధనల విషయమై ట్రంప్ సర్కారు దిగొచ్చింది. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ, తీసుకుని వచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. జూలై 6న యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఈ ఆదేశాలను జారీ చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మరో 17 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా నిలిపివేయాలంటూ పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు.


Next Story

Most Viewed