అయ్యో ఎంత పని జరిగింది.. పీకల్లోతు కష్టాల్లో ట్రంప్..

by  |
అయ్యో ఎంత పని జరిగింది.. పీకల్లోతు కష్టాల్లో ట్రంప్..
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా అందులో వింతే ఉంటుంది. ఆయన వ్యవహార శైలి కూడా అందరికన్నా భిన్నంగా ఉంటుంది. అయితే అలాంటి ట్రంప్ ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడట. ఆ నష్టాల నుంచి బయట పడటానికి ఇప్పుడు తన భారీ హోటళ్లను అమ్మకానికి పెట్టాడు. ఇందులో భాగంగానే వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ హోటల్ ను అమ్మకానికి పెట్టాడు. 264 గదులున్న ఈ హోటల్ ను ట్రంప్ ఆర్గనైజేషన్ 2016లో 60 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.

అయితే ఈ హోటల్ కు కరోనా కాలంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. 2019 లోనే అమ్మాలని చూసినా కొనేవాళ్లు లేక ఇంతకాలం అమ్మకం ఆగిపోయింది. సీజీఐ మర్చంట్ గ్రూప్ ఈ హోటల్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. దాంతో ట్రంప్ కష్టాలకు కొంత ఊరట లభించినట్టు అయింది. ఈ హోటల్ వైట్ హౌస్ కు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది.

Next Story

Most Viewed