దిమ్మ తిరిగే అప్డేట్‌తో ట్రూ కాలర్.. ఇక ఎదురుచూడాల్సిన పనిలేనట్లే..

by  |
దిమ్మ తిరిగే అప్డేట్‌తో ట్రూ కాలర్.. ఇక ఎదురుచూడాల్సిన పనిలేనట్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రూకాలర్ యాప్ మూడు కొత్త అప్డేట్‌లతో మనముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ట్రూకాలర్ అవతలి వారి కాంటాక్ట్ నెంబర్ లేకపోయినా ఈ యాప్ ద్వారా వాళ్ల పేరును తెలుసుకోవచ్చు. ఇది చాలా మందికి ఉపయోగపడింది. అందుకే చాలా వరకు ట్రూకాలర్ యాప్ లేని ఫోన్లు లేవు. అయితే ఇప్పుడు ట్రూకాలర్ తన యూజర్స్ కోసం కొత్త అప్డేట్‌లతో ముస్తాబవుతోంది. ఇప్పటికే ట్రూకాలర్ ద్వారా డబ్బులు కూడా పంపొచ్చు. ఇప్పుడు మళ్లీ ట్రూకాలర్ తన కొత్త అప్డేట్‌లో మూడు కొత్త ఫీచర్లను తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాటిలో వీడియో కాలర్ ఐడి, కాల్ రికార్డింగ్ ఫీచర్, ఘోస్ట్ కాల్ అంటూ అదిరిపోయే ఫీచర్స్ తీసుకురాబోతుంది.

వీడియో కాలర్ ఐడీ అంటే.. సాధారణంగా మనం ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకునే విధంగానే మన వీడియో తీసి ట్రూకాలర్‌కి సెట్ చేస్తాం. దీంతో అవతలి వ్యక్తికి మీ వీడియో ప్లే అవుతుంది. ఇంకోటి అందరికీ తెలిసిన కాల్ రికార్డింగ్ ఫీచర్. ఇక చివరిది ఘోస్ట్ కాలర్ ఆప్షన్. మీరు ఎప్పుడైనా ఎవరి నుంచి అయినా తప్పించుకోవాలనుకుంటే ఈ ఘోస్ట్ కాలర్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇందులో మీ ఆఫీస్ లేదా మీ తల్లిదండ్రుల నెంబర్లు సేవ్ చేసుకుని కావాల్సిన సమయానికి వారి నుంచి కాల్ వచ్చేటట్లుగా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకసారి షెడ్యూల్ సెట్ చేసిన తర్వాత, యాప్ ద్వారా మీకు ఎవరితో కావాలంటే వారితో కాల్ తెప్పించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో మీరు ఎప్పుడైన తప్పించుకోవాల్సి వస్తే ఫోన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అయితే ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఐవోఎస్‌లకు విస్తరిస్తామని కంపెని తెలిపింది.


Next Story

Most Viewed