సిద్దిపేటలో మొదటి రౌండ్ పూర్తి… వార్ వన్ సైడ్

by  |
సిద్దిపేటలో మొదటి రౌండ్ పూర్తి… వార్ వన్ సైడ్
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణంలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి రౌండ్ లో 21 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయినట్టు ఎన్నికల అధికారి తెలిపారు. మొదటి రౌండ్ ఒకటో హాల్లో ఒకటి నుంచి 12 వార్డులు, రెండో హాల్లో 13 నుండి 21 వార్డుల ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి 21 వార్డుల్లో 19 వార్డులు అధికార టీఆర్ఎస్ గెలుపొందగా… ఒకటి బీజేపీ, మరొకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. దీని బట్టి చూస్తే మళ్ళీ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ పార్టీ యే అధిష్టించునున్నట్టు స్పష్టమవుతోంది. కాగా మరికాసేపట్లో రెండో రౌండ్ ఫలితాలను లెక్కించనున్నారు. మొదటి రౌండ్ ఫలితాల పై టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. రెండో రౌండ్ లో మరిన్ని స్థానాల్లో గెలుస్తామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా బోని కొట్టలేదు. రెండో రౌండ్ లోనైన బోని కొడుతుందా లేదా చూడాలి.

మొదటి రౌండ్ విజేతలు వీరే…

1వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి విజేందర్ రెడ్డి

2వ వార్డు.. టీఆర్ఎస్అభ్యర్థి నాయిని. చంద్రం

3వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి వంగ. రేణుక తిరుమల్ రెడ్డి

4 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి కొండం. కవిత

5 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని. వినోద్

6 వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ. సాయి కుమార్

7వ వార్డు.. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల. శ్రీదేవి

8 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల. కవిత

9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల. సతీష్

10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్. లక్ష్మీ

11 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి. భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్

12 వ వార్డు టీఆర్ఎస్ తెల్జీరు. రేఖా శ్రీనివాస్ యాదవ్

13 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి విఠోభ

14 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అలకుంట. కవిత

15 వ వార్డు టీఆర్ ఎస్ అభ్యర్థి పాతురి. సులోచన

16 వ వార్డు టీఆర్ ఎస్ అభ్యర్థి బర్ల. మల్లికార్జున్

17 వ వార్డు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి. రాధ వేణుగోపాల్

18 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అడ్ఢగట్ల. కావేరి రేణుక

19 వ వార్డు టీఆర్ ఎస్ అభ్యర్థి గ్యాదరి. రవీందర్

20 వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి రియాజ్ ( యాపిల్ గుర్తు)

21 వ వార్డు టీఆర్ ఎస్ అభ్యర్థి ఖాజా తబసుమ్ అక్తర్ పటేల్

Next Story

Most Viewed