రోడ్డెక్కిన రైతన్నలు.. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా

by Aamani |
రోడ్డెక్కిన రైతన్నలు.. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా
X

దిశ,కోనరావుపేట /రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ రైతులు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒకవైపు అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయని, అయినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగడం లేదని, ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించడం తో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చరవాణిలో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

Next Story

Most Viewed