కేటీఆర్‌కు షాకిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మంత్రి పనిని ఆయనే ముగించేశాడు..

149
MLA

దిశ, డైనమిక్ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ వద్ద నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి మంగళవారం భూమి పూజ చేసేందుకు మంత్రి కేటీఆర్ రానున్నారు. అయితే అలంపూర్‌లో నిర్మించాల్సిన ఆస్పత్రిని అలంపూర్ చౌరస్తాకి తరలించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మంత్రి పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరంతా భూమి పూజను అడ్డుకునే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే ఓ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం జరపాల్సిన కార్యక్రమాన్ని సోమవారం రోజే పురోహితున్ని ఏర్పాటు చేసి ఏకాంతంగా భూమి పూజ చేశారు. ఇలా నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా ఈరోజు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యేతో ఉన్నవారు ప్రశ్నించగా.. ‘‘ మంగళవారం సరిగా లేదని.. సోమవారం పెళ్లి కొడుకుని చేసి మంగళవారం పెళ్లి చేస్తారు కదా అలానే.. ఇది కూడా అంతే. ఇవాళ కొంచెం పూజ చేసి వదిలేస్తే రేపు కేటీఆర్ వచ్చాక మొత్తం పూర్తి చేస్తారు. మంచి రోజు నాడు కేటీఆర్ రావాలంటే కుదరదు కదా..’’ అంటూ బదులిచ్చారు. ఈ విధంగా కేటీఆర్ చేయాల్సిన భూమిపూజను హుటాహుటిన ఎమ్మెల్యే చేయడం గమనార్హం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..