అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం...

by Disha Web Desk 20 |
అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం...
X

దిశ, భీమ్‌గల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని జెడ్పీటీసీ చౌట్ పల్లి రవి అన్నారు. సోమవారం భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, బాబానగర్, బాచెన్ పల్లి, మెండోర, ప్రిప్రి, ముచ్కుర్, కారేపల్లి గ్రామాలకి దాదాపు రూ.48 లక్షలతో కూడిన సంఘం, కమ్యూనిటీ హాల్ భవనాలకు టీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పేదలకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు ద్వారా ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు.

గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా రూ.5 లక్షల భీమా అందిస్తున్నామని అన్నారు. పేదింటి అడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుణవిర్ రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు శర్మ నాయక్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యాల శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు కవిత గంగాధర్, తుక్కాజి నాయక్, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

భీమ్‌గల్ మున్సిపల్ లో..

భీమ్‌గల్ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.15 లక్షలతో కూడిన పాలు సంఘం భవానాలకు టీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు మూత లింబాద్రి, బొదిరే నరసయ్య, సతీష్ గౌడ్, లింగం నాయక్, సీహెచ్ గంగాధర్, తుమ్మ ముత్తన్న, ఎంఎ రజాక్, ఎంఎ నయీం, పర్సనవీన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story