‘‘పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు’’

by  |
‘‘పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు’’
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతకొన్ని రోజులుగా ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీ మారడం లేదని, పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు డీసెంట్ రాజకీయాలు చేశానని, ఇన్నేళ్ల చరిత్రలో పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.


Next Story

Most Viewed