జలగం చొరవతో మంచినీటి సమస్య పరిష్కారం

by  |
Jalagam-1
X

దిశ, ములకలపల్లి: ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చేపుతుంటే ఆ ఆదివాసీ గ్రామాలకు ఇంతవరకు అధికారులు నీళ్లు వదలలేదు. స్థానికంగా ఉంటున్న నీళ్లనే వాడుకుంటున్నారు. ఈ విషయం స్థానిక ఎంపీటీసీ నూప సరోజిని ఇటీవల మండలానికి వచ్చిన మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావుకు తెలిపారు. తక్షణం మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో జలగం ప్రసాద్ రావు ఫోన్ లో మాట్లాడి సమస్యను తెలిపారు. మీకు వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది అని జలగం స్థానిక ఎంపీటీసీకి హామీ ఇచ్చారు. అనూహ్యంగా రెండు రోజుల్లోనే మంచినీటి సమస్య పటిష్కారమయ్యింది. ఈ సమస్యకు సంబంధించి వివరాల్లోకి వెళితే… గుండాలపడు గ్రామపంచాయతీ జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతం. ఇక్కడ మొత్తం ఆదివాసీ కుటుంబాలే నివాసం ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇక్కడ అమలుకు నోచుకోవడంలేదు. ఈ విషయం స్థానిక ఎంపీటీసీ నూప సరోజిని మాజీ మంత్రికి తెలిపిన 48 గంటల్లో ఆ గ్రామాల్లో మంచి నీటి సమస్య పరిష్కారమయ్యింది. ఆగమేఘాల మీద అధికారులు ఆ గ్రామానికి చేరుకొని రాత్రి పగలు శ్రమించి మంచి నీటిని అందించారు. దీంతో స్థానికులు జలగంకు కృతజ్ఞతలు తెలిపారు.

Jalagam-2

స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు

కొత్త గుండాలపాడు, పాత గుండాలపాడు గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు శనివారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


Next Story

Most Viewed