Leopard: చిరుతతో పోరాడిన అటవీ శాఖ అధికారి.. సాహసం చూసి ఔరా అంటున్న నెటిజన్లు (వీడియో వైరల్)

by Disha Web Desk 1 |
Leopard: చిరుతతో పోరాడిన అటవీ శాఖ అధికారి.. సాహసం చూసి ఔరా అంటున్న నెటిజన్లు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో కనిపించిన పిల్లిని చూస్తేనే మనం దడుచుకుంటాం. అలాంటిది ఏకంగా చిరుతపులే ఎదురుగా వస్తే.. ఇంకేముంది కనుచూపు మేరలో కనబడకుండా పరుగెడుతాం. కానీ, కాశ్మీర్‌లో ఓ అటవీ శాఖ అధికారి చేసిన సాహసం చూస్తే.. ఎవరైనా శభాష్ అనాల్సిందే. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌లోని గందర్భాల్‌ పరిధిలోని ఫతేపూర్‌ ప్రాంతంలో ఓ చిరుత జనావాసాల్లో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే చిరుతను బంధించేందుకు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

ఈ మేరకు ఫారెస్ట్ సిబ్బంది స్పాట్‌కు చేరకున్నారు. అందులో ఓ అధికారి చిరుతను తన చేతులతో బంధించేందుకు ప్రయత్నించగా.. చిరుత అతడి ఎడమ చేతిని నోటితో అందుకుంది. చాలాసేపు అతడు చిరుతును అదిమిపట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన తోటి అధికారులు కర్రలతో చిరుతను కొట్టగా అది కాస్త స్పృహ కోల్పోయింది. అనంతరం గాయపడిన అధికారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా చిరుతకు ప్రథమ చికిత్స చేసి తిరిగి అడవిలో వదిలేశారు.



Next Story

Most Viewed