Dosa printer: ఈ దోశ ప్రింటర్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. 5 నిమిషాల్లో రెడీ (వీడియో)

by Hamsa |
Dosa printer: ఈ దోశ ప్రింటర్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. 5 నిమిషాల్లో రెడీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజుకూ సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. అయితే, మనుషులు కూడా వాటికి అలవాడు పడిపోయి ప్రతి చిన్న పనిని కూడా యంత్రాల సహాయంతో చేసేస్తున్నారు. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు యంత్రాలే పని చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, మార్కెట్లోకి వచ్చిన ఓ దోశ ప్రింటర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఓ యువతి ఇంక్‌ను పోసినట్టు దోశ పిండిని పోసింది.

అనంతరం మిషన్‌ను ఆన్ చేసి అందులో టైమ్ సెట్ చేస్తే.. కాసేపటికే అందులో నుంచి వేడి వేడి దోశ బయటకు వచ్చింది. అయితే ఈ మిషన్‌ను చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈవోచెఫ్ పేరుతో దీనిని రూపొందించినట్టు సమాచారం. ఈ ప్రింటర్ ప్రపంచంలోనే తొలి స్మార్ట్ దోశ మేకర్‌గా పిలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

Next Story

Most Viewed