- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘యానిమల్’ సీన్ రిపీట్.. కాబోయే భర్తను సర్‌ప్రైజ్ చెద్దామనుకున్న వధువు.. చివరికి ఏం జరిగిందంటే? (వీడియో)
దిశ, ఫీచర్స్: ఒకప్పుడు పెళ్లిని కొంతమంది సన్నిహితులు, మధ్యలో చేసుకునేవారు. తక్కువ ఖర్చుతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టేవారు. కానీ ఈ మధ్య పెళ్లిని ఏకంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, బ్యాచ్‌లర్ పార్టీ, అంటూ అన్ని గ్రాండ్‌గా ఏర్పాటు చేసుకుంటూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కచ్చితంగా చేసుకుంటున్నారు.
అలాగే పెళ్లిలో కొన్ని కార్యక్రమాలు వెరైటీగా ప్లాన్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే తమ భాగస్వామికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని పెళ్లి కూతురు గెటప్‌లో పల్లకిలో రావడం వంటివి చేస్తున్నారు. అయితే రణ్‌బీర్, రష్మిక నటించిన యానిమల్ సినిమాలో ఫ్లైట్‌లో మొదటి రాత్రి ప్లాన్ చేసుకున్నట్లు కొందరు పెళ్లిని విమానంలో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ట్రెండ్ ఫాలో అవుతూనే సినిమాలో చేసినట్లుగా చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు విషయంలోకి వెళితే.. ఓ యువతి తన కాబోయే భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని మండపానికి ఫ్లైట్‌లో వెళ్లింది. కానీ మధ్యలో వాతావరణ మార్పుల వల్ల ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బ్రైడ్ డ్రెస్‌లో ఉండి వెళ్తుండగా.. సడెన్‌గా ఫ్లైట్ క్లాష్ అయి కిందపడిపోతుంది. దీంతో పెళ్లి కూతురితో పాటుగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను morbid knowledged అనే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అలాగే.. బ్రెజిలియన్ వధువు రోజ్‌మెర్ డో నాస్సిమెంటో సిల్వా తన కాబోయే భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసుకుంది. దురదృష్టవశాత్తు, హెలికాప్టర్ మార్గమధ్యంలో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో పెళ్లికూతురు మాత్రమే కాకుండా ఆమె సోదరుడు, పైలట్ ఆరు నెలల గర్భిణీ, ఫోటోగ్రాఫర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ ప్రారంభంలో వాతావరణ పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ ప్రయాణ సమయంలో భారీ పొగమంచు ఏర్పడింది. దీని వలన పైలట్ తన బేరింగ్‌లను కోల్పోయాడు. ఈ వార్త విన్నాక పెళ్లి కొడుకు కన్నీటి పర్వంతమయ్యాడు’’ అని రాసి ఉంది. దీంతో ఈ వీడియోను చూసిన వారంతా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
In 2016, Brazilian bride-to-be Rosemere do Nascimento Silva arranged for a helicopter to transport her to her wedding venue as a surprise for her fiancé.
— Morbid Knowledge (@Morbidful) April 19, 2024
Sadly, the helicopter crashed en route, and this footage captured by her photographer reveals her final moments alive.
The… pic.twitter.com/RUy0CzzU5y