తెలంగాణ బాలిక ఘనత.. 45 ఫ్రాక్చర్లను ఎదుర్కొని నేషనల్ చాంపియన్‌షిప్ విన్

by Disha Web Desk 5 |
తెలంగాణ బాలిక ఘనత.. 45 ఫ్రాక్చర్లను ఎదుర్కొని నేషనల్ చాంపియన్‌షిప్ విన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అతి చిన్న వయస్సులో 45 ఫ్రాక్చర్లను ఎదుక్కొని పట్టు విడువక పారా టేబుల్ టెన్నిస్ నేషనల్ చాంపియన్ షిప్ సాధించింది. సికింద్రాబాద్ కు చెందిన విజయ దీపిక బ్రైటల్ బోన్ డిసీజ్ తో బాధపడుతోంది. కేవలం 13 సంవత్సరాల వయస్సు ఉన్న విజయ దీపికకు ఇప్పటివరకు 45 ఫ్రాక్చర్లు అయ్యాయి. తన ఎముకలు పెలుసుగా ఉన్న చాంపియన్ షిప్ సాధించాలన్న తన ఉక్కు సంకల్పాన్ని అవేవి ఆపలేకపోయాయి. ఇంట్లోనే చదువుకుంటున్న విజయ తన అన్నయ్య విజయ్ తేజ్ టెన్నిస్ ఆడటం, టోర్నమెంట్ లకు వెళ్లడం చూసి తాను కూడా క్రీడల వైపు ఆకర్షితురాలు అయ్యింది.

తన తండ్రి విజయ్ భాస్కర్ రాజు సహాయంతో ఇంట్లోనే టేబుల్ టెన్నిస్ బోర్టు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. తనకున్న వ్యాదిని దిక్కరించి ఇదివరకే పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లో రజతం, డబుల్స్ లో కాంస్యం సాధించింది. ఇప్పుడు ఇండోర్ లో జరుగుతున్న యూటీటీ పారా టేబుల్ టెన్నిస్ లో పాల్గొని నేషనల్ చాంపియన్ గా నిలిచింది. ఎప్పటికైనా పారా ఒలంపిక్స్ లో పతకం సాధించాలనేది తన కల అని విజయ దీపిక చెబుతోంది.

Next Story

Most Viewed