కుక్క కరవడమే అదృష్టంగా భావిస్తున్న యజమాని.. ఆయన సంతోషానికి కారణమిదే..!

by Disha Web Desk 7 |
కుక్క కరవడమే అదృష్టంగా భావిస్తున్న యజమాని.. ఆయన సంతోషానికి కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. కానీ, పెంపుడు జంతువులు కొన్ని సార్లు యజమానులనే గాయపరుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ పెంపుడు కుక్క తన యజమానిపై దాడి చేసింది. కానీ.. పెంపుడు కుక్క తనని గాయపరచడమే అతడి వరంలా ఫీల్ అవుతున్నాడు యజమాని. అసలు ఏం జరిగిందంటే..

యూకేకు చెందిన డేవిడ్ లిండ్సే అనే వ్యక్తి, హార్లే (పిట్ బుల్ డాగ్) తో సోఫాపై నిద్రిస్తున్నాడు. అప్పుడు హార్లే తన యజమాని బొటన వేలును కొరికి నమిలేస్తుంది. అది గమనించిన డేవిడ్ భార్య గట్టిగా అరవడంతో అతడు నిద్ర లేచి చూస్తాడు. అయితే కుక్క అంతలా కాలు కొరికి నమిలేస్తున్న అతనికి స్పర్శ తెలియకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి టెస్ట్‌లు నిర్వహించగా అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు.

డేవిడ్‌కు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడంతో కాళ్లకు బ్లడ్ సర్కులేషన్ కూడా ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు. అతడి కాలుకు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆపడానికి వైద్యులు ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో తొమ్మిది రోజులు ఆసుపత్రిలో గడిపానని డేవిడ్ తెలిపాడు. దీంతో తనను కుక్క కరవడం మంచిదైందని.. అది నా వరంగా ఫీల్ అవుతున్నాని అతడు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా కుక్క కరవడం చేతనే తన కున్న వ్యాధి బయటపడింది కాబట్టి.. తన హార్లే (పెంపుడు కుక్క) బయటకు పంపడం లేదని అతడు పేర్కొన్నాడు.



Next Story

Most Viewed