కుక్క కోసం ఏకంగా మేకను బలి ఇచ్చిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

by Disha Web Desk 7 |
కుక్క కోసం ఏకంగా మేకను బలి ఇచ్చిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ఇంట్లో పెట్స్‌ను పెంచుకోని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కుక్కల్ని ఇంకాస్త ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో ఒక మనిషిగా ట్రీట్ చేస్తూ.. కుక్కలకి సపరేట్ బెడ్, ఫుట్ కూడా పెడుతుంటారు. అంతే కాకుండా కొంత మంది తము పెంచుకునే పెట్ డాగ్స్‌కు ఆరోగ్యం పాడైతే వేలకు వేలు ఖర్చు పెట్టి మరి వాటికి ట్రీట్‌మెంట్ చేయిస్తారు. ఇటీవల ఓ వ్యక్తి కూడా అదే విధంగా చేశాడు. తన పెట్ డాగ్‌పై తనకు ఉన్న ప్రేమను నిరూపించుకునేందుకు మరో మూగ జీవిని బలి ఇచ్చాడు. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనకు సంబధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ వ్యక్తి లక్కీ (కుక్క)ను పెంచుకుంటున్నాడు. సొంత పిల్లల మాదిరిగానే ఆ కుక్కను కూడా వాళ్లు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే.. కొద్ది రోజుల క్రితం పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ వ్యక్తి తమ కుక్కను ఆరోగ్యం బాగుపడాలని సమక్క-సారలమ్మకు మొక్కుకున్నాడు. ఇక కుక్క ఆరోగ్యం బాగుపడటంతో సమక్క-సారలమ్మకు బెల్లంతో లక్కీ తూలభారం వేయించి మొక్కు చెల్లించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఓ మేకను బలి ఇచ్చి బంధు, మిత్రులకు భోజనం ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. కొంత మంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘ఒక మూగ జీవిని కాపాడుకోవడం కోసం మరో మూగ జీవిని బలి ఇచ్చావు కదా’ అని ‘ఆ మేక ఏం చేసింది అన్నా’ అని మండిపడుతున్నారు.



Next Story

Most Viewed