- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్రం మరో గుర్రం గు*** ఆస్పత్రి బెడెక్కిన వరుడు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యంగా ప్లాన్ చేసుకుంటుంది నేటి యువత. నాలుగు కాలాల పాటు గుర్తుండిపోవాలంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉండాల్సిందే కదా మరి. ఇదే విధంగా చేయబోయిన ఓ పెళ్లి కొడుకు ఆస్పత్రి బెడెక్కాడు. ఈ ఘటనలో రాజసం ఉట్టిపడేలా వధువు దగ్గరకు వెళ్లబోయి బొక్కబోర్లా పడ్డాడు వరుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే...
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ వరుడు బంధువులతో కలిసి గుర్రపు రథం ఎక్కి పెళ్లి మండపానికి బయలుదేరాడు. అయితే రెండు గుర్రాలతో ఉన్న రథం ఓ మూలమలుపు దగ్గరకు రాగానే అందులోని ఓ గుర్రం అకస్మాత్తుగా బెదిరిపోయింది. వెంటనే రథం నుంచి విడిపించుకుంటూ పక్క గుర్రాన్ని కూడా లాగేస్తూ గుంతలో పడిపోయింది. దీంతో రెండో గుర్రం కూడా గుంతలో పడిపోవడంతో రథంతో సహా వరుడు, అందులో ఉన్న బంధుగణం కిందపడిపోయింది. ఈ సంఘటనతో వరుడు పెళ్లి పీటలను వదిలి.. ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లతోపాటు యానిమల్స్‌ను ఇలా ఉపయోగించే వారికి ఇదో గుణపాఠం అంటూ తిట్టిపోస్తున్నారు.