వరదనీటిపై ప్రయాణం.. SFI నేతల వినూత్న నిరసన

by  |
SFI leaders
X

దిశ, జనగామ: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనగామ జిల్లాలో జలమయమైన కాలనీలను శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షానికే స్థానికులు పడుతోన్న ఇబ్బందులు ఎమ్మెల్యే‌కు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పట్టణ ప్రగతిపై చేపడుతున్న అభివృద్ధి చాలా బాగుందని, చిన్నపాటి వర్షానికే జిల్లా కేంద్రంలో పడవ వేసుకొని తిరగొచ్చని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా.. వరదనీటిపై టైర్లపై నిల్చొని ప్రయాణం చేసి నిరసన వ్యక్తం చేశారు.

పేరుకే జనగామ జిల్లా కేంద్రం అని, అభివృద్ధి శూన్యమన్నారు. చిన్న వర్షానికే చిత్తడిగా మారి, ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారం చుపాలని కోరారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి జనగామ ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, మండల కార్యదర్శి రమేష్, బుట్టు సాంబా, సందీప్ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed