హుజురాబాద్ రిజల్ట్‌పై రేవంత్ కామెంట్స్.. వచ్చే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవే..

by  |
huzurabad-revanth
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై సంపూర్ణమైన బాధ్యత తనదేనని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ఫలితాలపై నివేదిక తెప్పించుకొని విశ్లేషణ చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్​ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయని, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి వెంకట్ నిరాశ చెందవద్దని కోరారు. పార్టీకి వెంకట్ మంచి లీడర్ అవుతారని, హుజురాబాద్ ​ప్రజల కోసం పోరాటం చేస్తాడన్నారు.

వచ్చే రోజులన్నీ కాంగ్రెస్​ పార్టీవేనని, ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా కొట్లాడుతామని రేవంత్​రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందని, ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేదని, గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1600 ఓట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు గెలిచిందన్నారు. గతంలో జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఈ ఓటమి నిరాశ శాశ్వతం కాదని, నిరాశ నుంచి నిర్మాణం చేపట్టుతామన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, సీనియర్ నేతల వ్యాఖ్యలపై మాట్లాడనంటూ పేర్కొన్నారు. పార్టీ విషయాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామని, సీనియర్లందరినీ పార్టీ కార్యక్రమాల్లో కలుపుకొని వెళ్తామని రేవంత్​రెడ్డి చెప్పారు.



Next Story

Most Viewed