మోడీ మాయలో కేసీఆర్.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by  |
మోడీ మాయలో కేసీఆర్.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : ప్రధాని నరేంద్ర మోడీ.. ఏం మాయ చేశారో కానీ.. సీఎం కేసీఆర్ మాట మార్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మొదట్లో రైతు ఉద్యమానికి మద్దతునిచ్చారని గుర్తుచేశారు. భారత్ బంద్ నేపథ్యంలో ఉప్పల్ బస్ డిపో వద్ద రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని ఆరోపించారు. గతంలో రైతులు తలపెట్టిన బంద్‌లో కేటీఆర్‌ కూడా పాల్గొన్నారని, మోడీని కలవగానే సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తే.. మోడీ సర్కారు రైతులను బానిసలుగా మార్చిందని విమర్శించారు. సాగు చట్టాలతో రైతుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందన్నారు.

సీఎం కేసీఆర్‌ బంద్‌లో పాల్గొనకుండా మోడీతో విందులో పాల్గొంటున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో లక్షా 9వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ కమిషన్లే చెప్పాయని, మరి ఎందుకు నోటిఫికేషన్లు వేయడంలేదో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులను నిండా ముంచుతున్నాడని.. అధానీ, అంబానీలకు సాగును మోడీ తాకట్టు పెట్టారని అన్నారు.

కేసీఆర్ రైతుల పక్షనా ఉన్నాడా..? లేకా రైతు వ్యతిరేకుల పక్షనా ఉన్నాడా..? స్పష్టం చేయాలని డిమాండ్ చేశాడు. బంద్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితోపాటు అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Next Story