వరద నీటిలో కాంగ్రెస్ నేతలు..

6

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎమ్మెస్ మక్తాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, అంజనీ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్ నీటిలోనే పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా ముంపునకు గురైన బాధితులను పరామర్శించారు.

అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. డల్లాస్ తరహాలో నగరాన్ని తీర్చిదిద్దుతామన్న టీఆర్ఎస్ నాయకులు కనీసం తిండి కూడా పెట్టడం లేదని విమర్శించారు. డ్రైనేజీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతోనే నగర రోడ్లు నదుల్లా మారాయన్నారు. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.