అక్టోబర్‌లో తగ్గిన టయోటా కార్ల సరఫరా!

by  |
Toyota
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) దేశీయంగా హోల్‌సేల్స్ అమ్మకాల్లో గతేడాదితో పోలిస్తే స్వల్పంగా 1 శాతం తగ్గి 12,440 యూనిట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో దేశీయంగా మొత్తం 12,373 యూనిట్లను సరఫరా చేసినట్టు టీకేఎం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘గడిచిన కొన్ని నెలలుగా దేశీయ ఆటో మార్కెట్లో డిమాండ్ బలంగా ఉంది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ముందుస్థాయితో పోలిస్తే డిమాండ్ సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే, ఇటీవల వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు, సెమీకండక్టర్ల కొరత వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని’ టీకేఎం సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అసోసియేట్ జనరల్ మేనేజర్ సిగమణి అన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో టయోటా సంస్థ అమ్మకాల పరంగా 34 శాతం వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో ప్రస్తుత ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య కాలంలో గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 78 శాతం పెరిగాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్ మోడళ్లు ప్రీమియం విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. మరో ప్రీమియం టయోటా వెల్‌ఫైర్ మోడల్ మెరుగైన అమ్మకాలను, వినియోగదారుల విశ్వాసం సంపాదిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed