జపాన్‌లో ప్రారంభమైన ఒలంపిక్ టార్చ్ జర్నీ

by  |
జపాన్‌లో ప్రారంభమైన ఒలంపిక్ టార్చ్ జర్నీ
X

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్ ముందు సాంప్రదాయంగా జరిపే టార్చ్ ర్యాలీ గురువారం జపాన్‌లోని ఫుకోషిమాలో ప్రారంభమైంది. జే-విలేజ్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో జపాన్ ఫుట్‌బాల్ క్రీడాకారణి అజుసా ఇవాషిమితు మొదటిగా టార్చ్ పట్టుకొని ర్యాలీని ప్రారంభించింది. 2011లో జపాన్‌లోని ఫుకోషిమలో భారీ భూకంపం సంభవించి 18 వేల మంది మరణించారు. వారి స్మృత్యర్థం ఒలంపిక్ టార్చ్ ర్యాలీని అక్కడి నుంచి ప్రారంభించినట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. 121 రోజుల పాటు కొనసాగే ఈ ర్యాలీ జపాన్‌లోని ముఖ్య నగరాలు, పట్టణాల గుండా సాగి జులై 23న టోక్యో చేరుకుంటుంది. కాగా, కొవిడ్ కారణంగా టార్చ్ ప్రయాణించే సమయంలో గుంపులుగా చేరవద్దని, అభిమానులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. ఒలంపిక్ టార్చ్ ర్యాలీని చూసిన తర్వాత దేశ ప్రజలందరూ పండుగ సంబరాల్లోకి వెళ్లిపోయారని.. ఒలంపిక్స్ తప్పక జరుగుతాయనడానికి ఇదొక సంకేతమని జపాన్ ప్రధాని యొషిహిదె సుగ అన్నారు.



Next Story

Most Viewed