ప్రశ్నించే గొంతునొక్కడమే ప్రజాస్వామ్యమా..? జర్నలిస్టులపై ఆగని దాడులు

by Disha Web Desk 3 |
ప్రశ్నించే గొంతునొక్కడమే ప్రజాస్వామ్యమా..? జర్నలిస్టులపై ఆగని దాడులు
X

దిశ డైనమిక్ బ్యూరో: వంశపారా పరిపాలన పోవాలన్నా.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులన్న మాట నిజం కావాలన్న.. రాజకీయ నాయకులను ప్రశంసల పల్లకిలో మోయడం ఆపాలి.. ప్రశ్నించే త్వత్వాన్ని అలవర్చుకోవాలి అని నమ్మిన వ్యక్తి జర్నలిస్ట్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్ట్. కనీస సదుపాయాలకు కూడా నోచుకోని మారుమూల గ్రామాలను సైతం వెలికి తీసి.. ఆ ప్రాంతాల్లో వెలుగు నింపేందుకు ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యలను రూపుమాపగల సామర్ద్యాన్ని, సమయస్ఫూర్తిని, ప్రజాసేవని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు జర్నలిస్టులు.

ప్రపంచ నలుమూలలా చోటు చేసుకుంటున్న మంచి, చేడు విషయాలను, వింతలు విశేషాలను ప్రజలకు తెలియచేసి.. ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అహర్నిశలు ప్రజాశ్రేయస్సు కోసం పని చేసే జరలిస్టులపై తరుచు దాడులకు పాల్పడడం అమానుషం. ఇది జర్నలిస్టుల ఆవేదన మాత్రమే కాదు జర్నలిజం విలువ తెలిసిన ప్రజల నోటి వెంట వస్తున్న మాట.

అయితే ప్రస్తుతం దేశంలో కొందరు రాజకీయ నాయకుల అరాచకాలు చూస్తుంటే.. భారత దేశం ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ ప్రజలే పాలకులన్న మాట పాఠ్య పుస్తకాలకే పరిమితమైనదా..? అని సందేహం కలగడంలో అతిశయోక్తి లేదు. తప్పును తప్పు అని చూపించడమే తప్పా..? ప్రజల కోసం నాయకులా..? నాయకుల కోసం ప్రజలా..? ప్రజలు ఓటుతో అందలమెక్కిన నాయకులు.. ఆ ప్రజలనే అణగదొక్కడం ఎంతవరకు సమంజసం..? ఆలోచించండి ఒక్కసారి.. ఇచ్చిన హామీలు నెరవేర్చారా..? ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ ను దారుణంగా గాయపరిచింది ఏపీ ప్రభుత్వం.

ఇటీవల జరిగిన సిద్ధం సభకు ఓ పత్రిక ప్రతినిధి హాజరు అయ్యారు. కాగా ఆ సభకి వెళ్లిన పత్రిక ప్రతినిధిని వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. కార్యకర్తలు చేసింది తప్పు అని చెప్పాల్సిన స్థానంలో ఉన్న వైసీపీ నేతలు తప్పు చేసిన కార్యకర్తలనే సమర్ధించారు. చివరికి ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జర్నలిస్ట్ పై దాడిని సమర్ధించడం దారుణం అంటున్నారు ప్రజలు.

ప్రశ్నిస్తే చాలు.. ఆ ప్రశ్నించింది రక్తం పంచుకు పుట్టిన చెల్లి అయినా, తల్లి అయినా ఓటు వేసి గెలిపించిన ప్రజలైన సరే జగన్ తన పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు అనే విషయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని ప్రజలు తమ అభిప్రయాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఆంధ్రాలో జర్నలిస్ట్ పై దాడిని మరవకముందే తెలంగాణలో ప్రముఖ జర్నలిస్ట్ శంకర్ పై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ శంకర్ పై దాడి చేయించిందని అని ప్రచారం జోరుగా చేస్తున్నప్పటికీ.. ఆ వార్తల్లో వాస్తవమెంత అనేదానిపై స్పష్టత లేదు. నిజంగానే తెలంగాణ అధికార పార్టీ దాడి చేయించిందా..? లేక వేరే వాళ్ళు ఎవరైనా చేయించి అధికార పార్టీపై ఆ నేరాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారా..? అనేది తెలియాల్సి వుంది. ఏదేమైనా ప్రజా శ్రేయస్సుకోసం పనిచేసే జర్నలిస్టులపై తరచూ దాడులు జరగడం బాధాకరం.



Next Story