భారీగా పెరిగిన టమాటా ధర

by  |
భారీగా పెరిగిన టమాటా ధర
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ కూర వండినా టమాటా వేయడం ఆనవాయితీ. టమాటా అన్ని కూరలకు రారాజు. కూరలో ఆ టమాటా వేస్తే టెస్టే వేరు. అయితే భారీ వర్షాలు రావడంతో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. వారం రోజుల్లోనే సుమారు నాలుగింతలు పెరిగాయి. కిలో రూ.15 ఉన్న టమాటా రూ.60కి పెరిగింది. అది ఎక్కడో కాదండి వారపు సంతలోనే. ఇక రియల్, ఇతర మార్కెట్లలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. పండుగపూట ధరలు పెరగడంతో సామాన్యుడికి భారంగా మారింది. కూరగాయలతోనైనా భోజనం చేసే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story