దోస్త్ అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు నేడు ఆఖరు తేదీ

by  |
దోస్త్ అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు నేడు ఆఖరు తేదీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ(దోస్త్) రిజిస్ట్రేషన్ కోసం తుదిగడువుగా నేటి(10.10.2020) వరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి పొడిగించింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు చివరి తేదీ కూడా నేటి(10.10.2020) వరకు అవకాశం విద్యా మండలి కల్పించింది. దోస్త్ -2020 మూడో దశ( ఫేస్-3) సీట్ల కేటాయింపులను ఈ నెల 15 న ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ (ఫేజ్ -1,II) ద్వారా సీట్లు లభించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 1,54,557గా ఉన్నది.

ఫేస్ -3లో దోస్త్‌లో నమోదు చేసుకున్నమొత్తం అభ్యర్థుల సంఖ్య 29,971, దోస్త్ ఫేస్ -3 లో వెబ్ ఆప్షన్ల ఎంపికలను ఉపయోగించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 67,082 అని విద్యామండలి వెల్లడించింది. అన్ని ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ (అన్ని దశలలో) అభ్యర్థులందరూ ఈ నెల 30 నుంచి నవంబర్ 04 వరకు అల్లాట్‌మెంట్‌ లెటర్, ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ రిసీప్ట్, ఇతర అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలతో తమకు కేటాయించిన / స్వీయ-రిపోర్ట్ చేసిన కళాశాలలో అందించాలని సూచించింది. లేని పక్షంలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ సీటును వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫేజ్-1/ఫేజ్-2లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నప్పటికీ సీటు రాని వారందరూ తక్కువ వెబ్ ఆప్షన్స్ సూచించుకున్నారని గ్రహించి అభ్యర్థులందరూ సీటును పొందటానికి మరో అవకాశంగా తుది గడువు నేటి(10.10.2020)కి పొడుగిస్తూ వెబ్ ఆప్షన్లను సూచించుకోవచ్చని తెలిపింది.

ఫేజ్ -1 లో సీటు కేటాయించినా కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేయని, సీటును కోల్పోయిన అభ్యర్థులందరూ ఇప్పుడు ఫేజ్-3 లో 10.10.2020 న లేదా అంతకుముందు దోస్త్ లో తిరిగి నమోదు చేసుకోవడం ద్వారా వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవాలని మండలి తెలిపింది. ఈపాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ అభ్యర్థులు అల్లాట్‌మెంట్ లెటర్‌ను తమ వద్ద పెట్టుకోవాలని సూచించింది. స్పెషల్ ఫేజ్ కోసం రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఈ నెం 15 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Next Story