ఏపీలో కరోనా కల్లోలం

by  |
ఏపీలో కరోనా కల్లోలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 54,463 మందికి పరీక్షలు నిర్వహించగా 8,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 86 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,368కి చేరింది. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,58,817 కేసులు రికార్డు అయ్యాయి.
ప్రస్తుతం 89,516 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,65,933 మంది బాధితులు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్క రోజే 8,741 మంది కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32 ,92,501 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి నెల్లూరు జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రకాశం జిల్లాలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తూర్పు గోదావరిలో 9మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:
అనంతపురం -933
చిత్తూరులో -495
తూర్పుగోదావరిలో-1441
గుంటూరు -467
కడపలో -639
కృష్ణ -154
కర్నూలు -484
నెల్లూరు -965
ప్రకాశం -589
శ్రీకాకుళం -485
విశాఖపట్నం -911
విజయనగరం -572
పశ్చిమగోదావరిలో 466 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story