బతుకమ్మ పూల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం.. టెన్షన్‌లో గ్రామస్తులు

by  |
బతుకమ్మ పూల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం.. టెన్షన్‌లో గ్రామస్తులు
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పాపంపేట గ్రామంలో పులి కదలికలు కనిపించాయి. పాపన్నపేట గ్రామానికి చెందిన దందేరా పెంటయ్య బతుకమ్మ పూల కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లగా పెద్ద పులి కనిపించింది. ఈ క్రమంలో పెంటయ్య కంగారు పడి బతుకమ్మ పూలు ఏమో కానీ ప్రాణాలు పోతాయని.. గ్రామానికి పరుగులు తీశాడు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించాడు.

దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు.. సర్పంచ్ బుజడి శేఖర్‌తో కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పులి పాదముద్రలు కనిపించడంతో భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు స్పందించి పులి నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరారు.

Next Story

Most Viewed