తెలంగాణకు మరో మూడు కంపెనీలు

by  |
తెలంగాణకు మరో మూడు కంపెనీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 887 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు పెట్టేందుకు మూడు కంపెనీలు ముందుకు వచ్చాయని, ఆ పరిశ్రమల స్థాపనతో 10 వేల 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం పార్క్ హయత్ లో జనపనార పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చిన గ్లో స్టార్ లిమిటెడ్కా, కాలేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎం బిజీ కమాడిటీ స్ లిమిటెడ్ లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జూట్ మిల్లు లేవని, ఇప్పుడు పరిశ్రమల స్థాపనతో గన్ని వేముల కొరత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గ్లోస్టర్ కంపెనీ 330 కోట్లు, కాలేశ్వరం ఆగ్రో లిమిటెడ్ 254 కోట్లు, ఎం బిజీ కమాడిటీ లిమిటెడ్ 303 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.

అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణ వంటి నీటి వనరులతో పాటు స్థానికంగా ఉన్న చెరువుల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగంలో భారీగా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉందని, అప్పుడే దీర్ఘకాలికంగా రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉండబోతుందని స్పష్టం చేశారు. జూట్ మిల్లుల పరిశ్రమలకు అవసరమైన జనపనార పంట పండించడం ద్వారా రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా రైతులు ఆసక్తి చూపాలని సూచించారు. పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి పెట్టుబడులుతో పాటు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మరింత లాభం కలిగే అవకాశం ఉందన్నారు. వరంగల్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి జిల్లాలో ఈ మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చేందుకు అవకాశం ఉందని, త్వరలోనే నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలో జూట్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed