Black fungus : పాపం చిన్నారులు.. కళ్లు పొగొట్టుకున్నారు

by  |
eyes-gone
X

ముంబై : మ్యూకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) సోకడంతో ముగ్గురు పిల్లలు కళ్లు కోల్పోయారు. బ్లాక్ ఫంగస్ డ్యామేజ్ చేయడంతో ముగ్గురు పిల్లలకూ చెందిన ఒక్కో కన్నును సర్జరీ చేసి తొలగించాల్సి వచ్చింది. ముంబైలోని రెండు హాస్పిటల్స్‌లో ఈ సర్జరీలు జరిగాయి. కరోనా నుంచి రికవరీ అయ్యాక ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారిలో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా కనిపించాయి.

కానీ, తాజాగా చిన్నపిల్లల్లోనూ కనిపించడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లు, ఆరేళ్లు, 14 ఏళ్ల పిల్లలకు ఈ ఆపరేషన్ జరిగింది. ఇందులో మొదటి ఇద్దరు పిల్లలకు డయాబెటిస్ లేదు. అయినప్పటికీ, బ్లాక్ ఫంగస్ సోకడంతో సర్జరీ చేసి ఒక్కో కన్ను తొలగించకతప్పలేదని వైద్యులు వివరించారు. మరో చిన్నారి పొట్టలోనూ బ్లాక్ ఫంగస్ గుర్తించామని తెలిపారు. సెకండ్ వేవ్‌లోనే మరో ఇద్దరు బాలికలు బ్లాక్ ఫంగస్‌తో హాస్పిటల్‌లో చేరారని, ఒకరిలో 48 గంటల్లోనే కంటి నుంచి ముక్కుకు వ్యాపించిందని, మెదడుకు చేరకముందే సర్జరీ చేశామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed