ఎన్నో ఏళ్ల రామభక్తుల కల నెరవేరింది : దర్శకేంద్రుడు

by  |
ఎన్నో ఏళ్ల రామభక్తుల కల నెరవేరింది : దర్శకేంద్రుడు
X

రాముడి జన్మస్థలమైన అయోధ్యపై శతాబ్దానికి పైగా నడిచిన వివాదం.. ఎట్టకేలకు సమసిపోయింది. హిందువుల చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరుతోంది. అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరబోతున్నాడు. వెండి ఇటుకతో శంకుస్థాపన చేస్తున్న ఈ ఆలయం.. మరో మూడున్నరేళ్లలో పూర్తి కానుంది. రామ మందిర భూమిపూజ శుభసందర్భంగా.. భక్తిరస చిత్రాలతోనూ తెలుగు ప్రజల మన్ననలు అందుకున్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు.. తన మనసులోని భావాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

‘ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రామభక్తుల కల నిజమైన రోజు ఇది. ‘శ్రీరామదాసు’ సినిమాను డైరెక్ట్ చేసిన వ్యక్తిగా ఎప్పటికీ గర్వపడతాను’ అని తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రంలోని రామ ఆగమన సన్నివేశానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఇదొక గొప్ప క్షణమని సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భూమిపూజ కోసం గంగా, యమున, సరస్వతి (త్రివేణి సంగమం) నుంచే కాకుండా దేశంలోని 11 పవిత్ర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టిని, జలాలను వినియోగిస్తున్నారు. కొవిడ్ ముప్పు నేపథ్యంలో.. 175 మంది ప్రముఖులను మాత్రమే తీర్థ క్షేత్ర ట్రస్ట్.. భూమి పూజ కార్యక్రమానికి రామ జన్మభూమికి ఆహ్వానించింది.



Next Story

Most Viewed