ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడు : జీయర్ స్వామి

by  |
Tridandi Devanatha Jiyar Swami
X

దిశ, అల్వాల్​ : ప్రతి జీవిలోను భగవంతుడున్నాడని శ్రీ త్రిదండి దేవనాథ జీయర్​స్వామి అన్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంను పురస్కరించుకొని సోమవారం అల్వాల్‌లోని పలు ఆలయాలను సందర్శించారు. భక్తులకు ప్రవచనాలను బోధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారంతో శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ క్రతువుకు భక్తులు నుంచి ధన, వస్తు రూపాల్లో వచ్చే బహుమతులను స్వీకరించ వచ్చని జీయర్​స్వామి చెప్పారు.

భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడని, అందువల్ల మనుషులు సమతా భావం కలిగి ఉండాలని కోరారు. దైవారాధనలో కుల, మతాల ప్రస్తావన ఉండకూడదని, భవగంతుని ముందు మనుషులందరూ సమానులేనని గుర్తుచేశారు. అనంతరం పాత అల్వాల్‌లోని పురాతన రామాలయం, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed