అది వద్దంటే మీకే నష్టం..?

by  |
అది వద్దంటే మీకే నష్టం..?
X

దిశ, వెబ్ డెస్క్: కరివేపాకు అంటే చాలు.. మనకు టక్కున ఇట్టే గుర్తొస్తది. సువాసన కోసం మాత్రమే దానిని వంటలలో వేస్తారని చాలా మందికి తెలుసు. ఈ కరివేపాకు వంటకాలల్లో వేసేందుకు కొందురు ఇష్టపడుతారు.. మరికొందరు ఇష్టపడరు. అయితే.. ఈ ఆకు వల్ల ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఆ ఉపయోగాలేమిటంటే.. ఈ కరివేపాకులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా అనేక వ్యాధులకు కరివేపాకు ఓ ఔషధంగా పనిచేస్తది. గుండె సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ఇతర దీర్ఘకాలిక జబ్బులను అదుపులో ఉంచేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తది.

అంతేకాదు.. కరివేపాకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఉండే చక్కర స్థాయిని కూడా ఇది నియంత్రించగలుగుతది. ప్రతిరోజూ దీనిని తింటే షుగర్ వ్యాధి కూడా మన దరిచేరదు. అదేవిధంగా కరివేపాకును రసంగా చేసుకుని ప్రతిరోజూ కళ్లలో రెండు చుక్కలు వేసుకుంటే కంటి సమస్యలు కూడా దూరమవుతాయి. నోటి సమస్యలు, నరాల బలహీనత, వాంతులు వంటి ఇతరాత్ర సమస్యలకు కూడా ఇది చక్కగా పనిచేస్తది. ఒక చెంచాడు కరివేపాకు రసం తీసుకుని అందులో మరో చెంచాడు నిమ్మరసం, పంచదార కలిపి తాగితే చాలు పై రోగాలన్నీ మటుమాయమవుతాయి. మీకు జ్వరమొచ్చినప్పుడు కరివేపాకు కషాయాన్ని తీసుకుంటే వెంటనే జ్వరం తగ్గుతది. చర్మవ్యాధులకు కూడా ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తది. ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కరివేపాకును ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. కరివేపాకు వల్ల ఎంత ఉపయోగమనేది మీరిప్పుడు తెలుసుకున్నారు కదా!.. సో.. ఇక నుంచి మీ వంటలలో ఖచ్చితంగా కరివేపాకు వేయండి.. దాని మూలంగా కలిగే ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.

Tags: vitamins, benefits, diseases, curry leaves


Next Story