కేసీఆర్ ఇలాఖాలో సంచలన ఘటన.. దానికోసం పెట్రోల్ పోసుకొన్న యువకుడు

by  |
medhak news
X

దిశ, గజ్వేల్: డబుల్‌ బెడ్ రూమ్ ఇంటిని తనకు కేటాయించలేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండలంలోని నూతనంగా ఏర్పడిన బహిలింపుర్ (ఆర్ అండ్ ఆర్ కాలనీ) లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ఇలాఖాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే పల్లె నవీన్ యాదవ్ (28) బహిలింపుర్ గ్రామ నిర్వాసితుడు. కొండపోచమ్మ జలాశయంలో ఇల్లు కోల్పోయిన వారికి, యువకులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ కు మొదటి లిస్టులోనే తన పేరు ఖరారు కాగా.. ప్రస్తుతం నిర్మితమైన ఇంటిలో ఉండమని అధికారులు తెలిపారు.

ఇక ఇటీవల రెండో విడతలో తన పేరు ఖరారు కాలేదని, తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు వీఆర్వో అరుణ తనను మానసికంగా ఇబ్బంది పెడుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డబుల్‌ బెడ్ రూమ్ ఇంటి కోసం బహిలింపుర్ గ్రామాన్ని ఖాళీ చేసినప్పుడే దరఖాస్తు చేసుకున్నానని, మొదటి దఫా లో తన పేరు ఖరారు కాగా ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటూ అధికారులను ప్రశ్నించాడు. వెంటనే తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని అధికారులను కోరాడు. అర్హుల జాబితాలో మొదటి దఫా లో నవీన్ యాదవ్ పేరు వచ్చింది. అయితే చివరి కేటాయింపు లిస్టులో తన పేరును అధికారులు తొలగించరాని నవీన్ యాదవ్ తెలిపాడు. తనకిచ్చిన ఇంటికి రెండు లక్షల వరకు ఖర్చు పెట్టామని బాధితుడు తెలిపాడు.

Next Story

Most Viewed