ఆక్సిజన్ వినియోగంపై కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు

by  |
Union Home Ministry
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగంపై ఆదేశాలు జారీ చేసింది. వైద్య అవసరాలకు మాత్రమే మెడికల్ ఆక్సిజన్ వినియోగించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఇతర అవసరాలకు లిక్విడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఉత్పాదక యూనిట్ల ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తిని గరిష్టంగా పెంచవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ వైద్య అవసరాల కోసం మాత్రమే లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగించాలని తెలిపింది.

అంతేగాకుండా.. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారి నుంచి 45 ఏండ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. కోవిన్ అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక.. నేరుగా వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదు అని తెలిపింది. వ్యాక్సిన్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున కేంద్రం నిర్ణయం తీసుకుంది. 45 ఏండ్లు దాటిన వాళ్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రంలోనే వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని సూచించారు. ఈ నెల 28 నుంచి ఆరోగ్యసేతు, కోవిన్ యాప్‌లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది అని వెల్లడించింది.


Next Story