దయచేసి అలాంటివారు తిరుమలకు రావొద్దు.. టీటీడీ కీలక ఆదేశాలు

by  |
దయచేసి అలాంటివారు తిరుమలకు రావొద్దు.. టీటీడీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఆలయాలు ఇప్పటికే మూత పడగా, మరికొన్ని ఆలయాల్లో కఠిన ఆంక్షలు విధించారు. తాజాగా.. ఏపీలోనూ వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్య స‌మ‌స్యలున్న భ‌క్తులు తిరుమ‌ల యాత్రను వాయిదా వేసుకోవాల‌ని తెలిపింది. ఇప్పటికే ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకున్నవారికి టీటీడీ ఒక ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు కొవిడ్‌ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే రానున్న 90 రోజుల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామ‌ని ప్రక‌టించారు. ఇక క‌రోనా నియంత్రణ‌లో భాగంగా.. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

Next Story

Most Viewed