సుప్రీంకోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ.. ఆ ఫిర్యాదు కొట్టివేత

by  |
jagan supreme court
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టేసింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై సీఎం జగన్ 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు అని తెలిపింది. ఇకపోతే సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీరమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ కార్యాలయం బుధవారం నాడే ప్రకటన విడుదల చేయడం గమనార్హం.


Next Story