ఇంత నిర్లక్ష్యమా.. ఎగ్జామ్‌కి అటెండ్ అయితే అబ్సెంట్ వేశారు..

by  |
ఇంత నిర్లక్ష్యమా.. ఎగ్జామ్‌కి అటెండ్ అయితే అబ్సెంట్ వేశారు..
X

దిశ, జగిత్యాల: తెలంగాణలో పరీక్ష ఫలితాలపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల్లో తప్పిన కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు అధికారుల తప్పిదాల వల్ల కొంతమంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా సరిగా చదవలేక ఫెయిల్ అయి కొందరు బాధపడుతుంటే పరీక్షలు బాగా రాసినా కూడా గైర్హాజరు అని రావడం పట్ల విద్యార్థి దిగ్భ్రాంతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో చోటు చేసుకుంది

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కడమండ లత నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పీజీ కాలేజీలో ఎంఏ తెలుగు రెండవ సంవత్సరం చదువుతుంది. జూలైలో నిర్వహించిన రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ అన్ని పరీక్షలకు లత హాజరైంది. అయితే రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాలలో ఒక సబ్జెక్టులో గైర్హాజరుగా రావడం పట్ల తీవ్రమైన మనో వేదనకు గురయ్యామని తెలిపింది. తాను అన్ని పరీక్షలకు హాజయ్యానని ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదని వాపోయింది. పరీక్ష రాసిన సెంటర్ నిర్వాహకులను సంప్రదిస్తే యూనివర్సిటీ తప్పిదమని, పరీక్ష కేంద్రంలో ఎలాంటి తప్పు జరగలేదని సమాధానం ఇచ్చారని తెలిపింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది.

Next Story