‘దిశ యాక్ట్’ ఒక ఫేక్ చట్టం : నారా లోకేశ్

by  |
nara-lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: దిశ చట్టంపేరుతో రాష్ట్రప్రజలను మోసం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. దిశ చట్టం అంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటోదని అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ మాధవ్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం చెప్పిన సమాధానం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఫేక్ సీఎం ఇస్తున్న ఫేక్ జీవోల మాదిరిగానే ఫేక్ చట్టం అని అందరికీ తెలిసిపోయిందన్నారు. అయినప్పటికీ ఇంకా దిశ చట్టం అంటూ జగన్ సర్కార్ మాయమాటలు చెప్తోందని ధ్వజమెత్తారు.

దిశచట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు..14 రోజుల్లోకోర్టు విచారణ.. 21 రోజుల్లో ఉరిశిక్ష విధించేలా దిశచట్టం రూపొందించామని చెప్పుకున్న ఏపీ ప్రభుత్వం గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడికి 21రోజుల్లో ఏం శిక్ష విధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా 13 రోజులే ఉన్నాయని లోకేశ్ గుర్తు చేశారు. దిశ చట్టంతో రాష్ట్రంలోని ఆడవారికి ఎలాంటి ఉపయోగం కలగలేదని ప్రకటనతో రూ.30కోట్లు సొంత మీడియా లబ్ధిపొందిందని ఆరోపించారు. రమ్యను బలితీసుకున్న ఉన్మాదిని ఎప్పుడు ఉరితీయబోతున్నారు? అంటూ ట్విటర్ వేదికగా లోకేశ్ ప్రశ్నించారు.


Next Story