ఐటీ ప్రొఫెషనల్స్​తో ఈటల ఆత్మీయ సమావేశం

by Disha Web Desk 15 |
ఐటీ ప్రొఫెషనల్స్​తో ఈటల ఆత్మీయ సమావేశం
X

దిశ, కూకట్​పల్లి : ఐటీ ప్రొఫెషనల్స్​తో ఈటల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారతీయులు గర్వంగా ప్రపంచ దేశాలలో తలెత్తుకుని జీవిస్తున్నారంటే దానికి కారణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో శనివారం ఐటీ ప్రొఫెషనల్స్​తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటల నవనీత్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్​ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​ మాట్లాడుతూ నేడు భారతీయులు గర్వంగా ప్రపంచ దేశాలలో తలెత్తుకొని జీవిస్తున్నారంటే దానికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. దేశ అభివృద్ధికి మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించేందుకు ఐటీ నిపుణులు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ గురించి సరైన ప్రచారాన్ని చేయాలని కోరారు.

టాయిలెట్లు కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని అన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ మహిళల బాధను అర్ధం చేసుకోలేదని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా రాష్ట్ర ఆదాయాన్ని లెక్క చేయకుండా లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని అన్నారు. రైతుల రుణాలు మాఫీ కాకపోవడం, బ్యాంకులకు డబ్బు కట్టకపోవడంతో వారు అష్టకష్టాలు పడ్డారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు పాలక పక్షంపై కొట్లాడడం రాజకీయాలలో సహజమే కానీ తాను అధికారంలో ఉండి కూడా ప్రభుత్వంతో కొట్లాడానని అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పోయి వారి సమస్యను పరిష్కరించమని కోరానని తెలిపారు. డ్రైనేజ్‌ సంపుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి కేవలం 8 వేల రూపాయల జీతం సరిపోదని వాదించానని, వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించానని అన్నారు. ఐటీ నిపుణులు బీజేపీకి అండగా ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేయాలని కోరారు.



Next Story

Most Viewed