సెకెండ్ జనరేషన్ మహీంద్రా థార్ ఆవిష్కరణ

by  |
సెకెండ్ జనరేషన్ మహీంద్రా థార్ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరికొత్త థార్ మోడల్‌ (Thor model)ను ఆవిష్కరించింది. ఎస్‌యూవీ థార్‌ (SUV Thor)ను ప్రాతిష్టాత్మకంగా దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఐకానిక్ డిజైన్ (Iconic design), నూతన భద్రతా ఫీచర్‌ (New security feature)లతో సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల సుధీర్ఘమైన పరీక్షల అనంతరం దీన్ని శనివారం పరిచయం చేస్తూ, ఫ్రీడమ్ డ్రైవ్‌ (Freedom Drive)లో భాగంగా ఈ వాహనాన్ని తెచ్చామని కంపెనీ తెలిపింది. అలాగే, ఫస్ట్ జనరేషన్ మోడల్ (First Generation Model) కంటే పెద్ద వాహనంగా, బీఎస్6 (BS 6) నిబంధనలను అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో కొత్త థార్‌ను ప్రస్తుత ఏడాది అక్టోబర్ 2న మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.

దీనికి సంబంధించిన ధర, ప్రీ-బుకింగ్ (Pre-booking) వివరాలను సైతం అప్పుడే ప్రకటించనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) పేర్కొంది. ఇక, సెకండ్ జనరేషన్ థార్ మోడల్‌ (Second Generation Thor Model)లో అన్నీ కొత్తవిగానే ఉండనున్నట్టు, శక్తివంతమైన్ ఇంజన్ (Powerful engine), టచ్‌స్క్రీన్ (Touchscreen) సామర్థ్యం కల్గీన కొత్త 18 సెంటీ మీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం (Infotainment system), క్రూయిజ్ కంట్రో (Cruise Control), 6 స్పీడ్ మాన్యుయల్ ట్రాన్స్‌మిషన్ (6 speed manual transmission), ఫార్వార్డ్ ఫేసింగ్ సీట్లు ఫీవర్లను అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది. అలాగే, కొత్త మహీంద్రా థార్ ఏఎక్స్, ఎల్ ఎక్స్ సిరీసుల్లో 2 రంగుల్లో లభిస్తుందని, దీని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (2.0 liter turbo petrol) ఇంజిన్ 150 హెచ్‌పీ, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపింది.

Next Story

Most Viewed