‘అమర జవాన్‌ త్యాగం వెలకట్టలేనిది’

by  |
‘అమర జవాన్‌ త్యాగం వెలకట్టలేనిది’
X

దిశ, ఏపీ బ్యూరో: ఉగ్రవాదులపై పోరులో భాగంగా కాశ్మీర్‌లో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనదని కొనియాడారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

హోంమంత్రి సుచరిత దిగ్బ్రాంతి..

భారత సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మృతి పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని సుందర్ బాని సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల వాసి జశ్వంత్ రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. జవాన్ జశ్వంత్ రెడ్డి మృతిపట్ల సుచరిత విచారం వ్యక్తం చేశారు. జస్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సుచరిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Next Story

Most Viewed