రెండు లారీలు ఢీ… ఒకరు మృతి

40

దిశ, వెబ్‌‌డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజంపేట మండలం వూటుకూరు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఏనుగును తప్పించబోయి ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీ కొన్నాయి. అంతేగాకుండా లారీ వెనకాల వస్తున్న ఓ కారు కూడా లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్న పాపకు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.