జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది: లోక్ సత్తా

by  |
జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది: లోక్ సత్తా
X

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని, పరిమితికి మించి అప్పులు చేసి ఏటా 35 వేల కోట్ల రూపాయలు వడ్డీలు ప్రభుత్వం చెల్లిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం తో ఉద్యోగుల వేతనాలు , వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సకాలంలో చెల్లింపులు చెయ్యలేని స్థితిలో ఉందని ఆరోపించారు.

గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యానికి నేటికి బకాయిలు చెల్లించలేదని, కరోనా సమయంలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి నేటికి జీతాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 45 వేల కోట్ల రూపాయల ఖర్చులకు సంబంధించిన వివరాలు లభించలేదని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ వెల్లడించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన దిశను కోల్పోయి ఎటువెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు అధికారులు చోద్యం చూస్తున్నారని భీశెట్టి ఆరోపించారు.

లోక్ సత్తాపార్టీ 8 లక్ష్యాలతో ప్రజా ఉద్యమం!

లోక్ సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ రూపొందించిన ఎనిమిది లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని బాబ్జి తెలిపారు.

తమ ఎనిమిది లక్ష్యాల్లో:

1.అధికార వికేంద్రీకరణ,

2.చట్టబద్దత పాలన,

3.సామాన్య పౌరులకి సక్రమంగా పౌర సేవలు,

4.ప్రజలకు ఆర్థిక భారం పడకుండా సమగ్ర ఆరోగ్య వ్యవస్థ అమలు,

5.ఏ స్కూల్లో చదివినా ప్రతి బిడ్డకూ మంచి ప్రమాణాల విద్య,

6.పాలనలో పారదర్శికత, జవాబుదారీతనం,

7.వ్యవసాయం లో ఆదాయం,

8.రాజకీయ సంస్కరణలు,

తదితర అంశాలపై రాష్ట్రంలో ని యువత కి మార్గ నిర్దేశం చేస్తామని అన్నారు.


Next Story