నేడే అభ్యర్థులను ప్రకటించే అవకాశం

by  |
నేడే అభ్యర్థులను ప్రకటించే అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆదివారం ముగిసింది. సాయంత్రం మూడు గంటలకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ అభ్యర్థుల తుది జాబితాను విడుదలను రాత్రి పది గంటల వరకూ కూడా విడుదల చేయలేదు. అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేసే అవకాశముందని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 17 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆదివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. 18న ఓటర్ల జాబితాను విడుద చేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్లను కూడా స్వీకరించారు. నవంబర్ 20 వరకూ తుది గడువును ప్రకటించారు.

18 నుంచి 20వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత రెండు రోజుల వరకూ కూడా బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం గమనార్హం. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన చేసిన ఎన్నికల అధికారులు 1,893 మంది అభ్యర్థులకు సంబంధించి 1, 825 నామినేషన్లను అర్హత సాధించినట్టు ప్రకటించారు. ఎన్ని చోట్ల నామినేషన్లు వేసినప్పటికీ ఒక అభ్యర్థి ఒకే డివిజన్ నుంచి పోటీలో ఉండేవిధంగా ఎన్నికల సంఘం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అయితే ఏ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు రెండు చోట్ల నుంచి నామినేషన్లను వేయలేదు.

150 వార్డులకు అన్ని ప్రధాన పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. టీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తులు దాడులు, పార్టీ కార్యాలయాల్లో గలాటాలకు కూడా దిగారు. అధికార పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీల నుంచి కూడా రెబల్ అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేసినప్పటికీ బుజ్జగింపుల అనంతరం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఈ నెల 22 నాటికే ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ పూర్తవ్వడంతో అభ్యర్థుల తుది జాబితా ఖరారయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించినా.. జాబితాను అధికారికంగా విడుదల చేయలేదు.


Next Story