స్వాతంత్య్ర దినోత్సవం రోజే కలెక్టర్ కాళ్ల మీద పడిన రైతు (వీడియో)

by  |
స్వాతంత్య్ర దినోత్సవం రోజే కలెక్టర్ కాళ్ల మీద పడిన రైతు (వీడియో)
X

దిశ, భూపాలపల్లి : మీ కాళ్లు పట్టుకుంటాను మా భూమి మాకు పట్టా చేయండి మా భూమిఎవరో పట్టా చేసుకుని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ రైతు కలెక్టర్ కాళ్లపై పండింది. ఈ ఘటన భూపాల్ పల్లి జిల్లా గణపురం మండలం‌లోని కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కాళ్లపై పడ్డారు. బానిసత్వంపోయి స్వేచ్ఛా వాతావరణంలోకివచ్చిన రోజే సామాన్య ప్రజలను కొంతమంది దళారులు చేసే అక్రమాలకు సామాన్య ప్రజలు బలైపోతున్నారు.

కొండాపూర్ గ్రామానికి చేందిన సమార్ల సదయ్య, సామర్ల నర్సయ్య అనే రైతులకు కొండాపూర్ శివారులో 8/151 సర్వే నెంబర్ లో గల “రెండు ఎకరాల ఇరవై గుంటల “భూమిని గత 40 సంవత్సరాల నుంచి వారసత్వంగా సాగుచేసుకుంటున్నారు. ములుగుకు చెందిన బాస్కర్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని పట్టాచేసుకున్నారని, వారు తమ భూమి తమకు పట్టా చేయాలని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పట్టా లేకున్నప్పటికీ అట్టి భూమిని ఇప్పటివరకు ఈ భూమిని మేమే సాగు చేసుకుంటుంన్నామని, మీరైన మాకు న్యాయం చేయాలని జాయింట్ కలేక్టర్‌ను రైతులు వేడుకున్నారు. తమ భూమి తాము పట్టా చేయకుంటే తమకు మరణమే దిక్కు అంటూ వారు జాయింట్ కలెక్టర్‌తో వాపోయారు.

Next Story

Most Viewed