‘డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మనోజ్ మృతి’

by  |

దిశ, క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందాడని, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, వైద్య సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ సోదరుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదిన తనకు, తమ్ముడు మనోజ్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. అర్థరాత్రి 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వెళ్లామన్నారు. మరుసటి రోజు మనోజ్‎కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పినా కూడా వైద్యులెవరూ స్పందించలేదని ఆరోపించారు. గాంధీలో చేరిన మాకు సరైన బెడ్ సౌకర్యం కల్పించలేదన్నారు. అత్యవసర సమయంలోనూ ఐసీయూలోకి మార్చేందుకు 3 గంటలకు పైగా సమయాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆక్సిజన్ అవసరమైనా కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఈ నెల 7వ తేదీన మరణించినట్టు చిలకలగూడ పోలీసుల నుంచి సమాచారం అందినట్టు తెలిపారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించిన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయికుమార్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed